Fans’ Reaction: షేయ్ ఆన్ యూ కావ్యా మారన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Fans' Reaction: లండన్‌లో జరిగిన ద హండ్రెడ్ లీగ్ పోటీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్య మారన్‌ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. విదేశీ లీగ్‌లో ఆడే సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ, పాకిస్థాన్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందించడం...