CI Sridhar Rao: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
CI Sridhar Rao: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నార్కోటిక్ ఎస్సై లోకం సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల...