TamilNadu: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు స్థానాల నుంచి పోటీకి విజయ్ సిద్ధం
TamilNadu: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకువస్తూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చెన్నైలో భారీ భద్రత మధ్య జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విజయ్ విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల ముందు ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నటుడిగా విశేష ప్రజాదరణ పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో తన బలం చూపించేందుకు సిద్ధమవడం విశేషంగా మారింది....