Bank Holidays: ఇంతకీ బ్యాంకులకు రేపు సెలవు ఉన్నట్లా? లేనట్లా?
Bank Holidays: శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేరోజు ఉండకపోవడం వల్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం పండుగల ఆధారంగా రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవులు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగను మార్చి 27న జరుపుకుంటుండటంతో ఆ రోజున బ్యాంకులు పూర్తిగా...