STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 10:26 pm Posted by : Star Trinethram

Woman Harassment: 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

Woman Harassment: హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో ఓ వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువతి ఉద్యోగావకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతంలో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జున్‌రెడ్డి అనే 50 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం 2024లో ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం సంబంధం తెగిపోయినట్టే కనిపించినా, గత సంవత్సరం నుంచి మల్లికార్జున్‌రెడ్డి మళ్లీ ఆమెను సంప్రదించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇటీవల మధురానగర్‌లోని ఓ ఇంటికి ఆమెను తీసుకెళ్లి, గతంలో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. తన మాట వినకపోతే ఆ చిత్రాలను కుటుంబ సభ్యులకు పంపిస్తానని భయపెట్టడంతో ఆమెను లొంగదీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఒత్తిడి, బెదిరింపుల నేపథ్యంలో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది.

ఈ ఘటనల నేపథ్యంలో ఆమె గర్భం దాల్చినట్లు సమాచారం. ఆ విషయాన్ని తెలుసుకున్న నిందితుడు అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితులు విషమించడంతో బాధితురాలు తన స్నేహితురాలి సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసుపై విచారణ కొనసాగుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ALSO READ: Haryana Crime: 19 ఏళ్ల అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌కు నిప్పంటించిన ప్రియుడు