ఇదీ మావా శోభితా ధూళిపాళ్ల రేంజ్.. టాప్-3 రొమాంటిక్ రోల్స్.. మీరు చూశారా?
తెలుగు అమ్మాయి అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటీమణి శోభిత ధూళిపాళ్ల. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోంది. మోడ్రన్ వెడ్డింగ్ ప్లానర్‌గా అయినా, సీక్రెట్ ఏజెంట్‌గా అయినా, హిస్టారికల్ పాత్రలో అయినా.. ప్రతి క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకతగా మారింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అనే తేడా లేకుండా శోభిత చేసిన పాత్రలు ఆమెను గ్లోబల్ ఆడియన్స్‌కు దగ్గర...