STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 8:34 pm Posted by : Star Trinethram

పెళ్లికి మంచి ముహుర్తాలు ఇవే..

ధనుర్మాసం, మౌడ్యమి కారణంగా గత కొంతకాలంగా శుభముహూర్తాలు లేక వివాహాలు నిలిచిపోయాయి. మౌడ్యమి రోజుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించడం శుభప్రదం కాదని పండితులు సూచించడంతో చాలా కుటుంబాలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నాయి. డిసెంబరు నుంచి కొనసాగిన ఈ విరామం వల్ల పెళ్లిళ్లకు సిద్ధమైన అనేక కుటుంబాలు ఎదురుచూపుల్లోనే నిలిచిపోయాయి.

ఇప్పుడు వారికి శుభవార్త వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి మళ్లీ మొదలుకానుంది. దాదాపు 4 నెలల పాటు అనుకూలమైన తేదీలు వరుసగా ఉండటంతో వివాహ వేదికలు కళకళలాడనున్నాయి.

పండితుల ప్రకారం.. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలు అనుకూలం. ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు శుభదినాలుగా పేర్కొన్నారు. మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో వివాహాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్లు, పండుగ వాతావరణం, శుభకార్యాల సందడి రానున్న నెలల్లో మరింత ఉత్సాహంగా ఉండనుంది.

ALSO READ: Muqabla Song: చీర కట్టులో స్టెప్పులతో ఇరగదీసిన లేడీ ప్రొఫెసర్ (VIDEO)