విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి..?
విహారయాత్రకు వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొందరు విదేశాలను చుట్టిరావాలని కలలు కంటారు, మరికొందరు దేశీయంగా కొత్త ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. ఇంకొందరు కనీసం దగ్గరలో ఉన్న సందర్శక ప్రాంతాలకైనా వెళ్లాలని భావిస్తారు. ఆలోచన దాకా బాగానే ఉంటుంది కానీ, బడ్జెట్ మాట వచ్చేసరికి చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్ర కోసం ప్రత్యేకంగా డబ్బు కేటాయించడం కష్టమేనని చాలామంది భావిస్తుంటారు. అయితే సరైన ప్లానింగ్ ఉంటే విహారయాత్రకు డబ్బు పెద్ద సమస్య కాదని ఆర్థిక...