STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 11:52 am Posted by : Star Trinethram

Prices: ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

Prices: మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ. చిన్న శుభకార్యం అయినా, పండుగ, పుట్టిన రోజు, వివాహ సీజన్ లో కూడా ప్రతి ఇంట్లో బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం. ఇటీవల కాలంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వినియోగదారులని ఆందోళనలోకి నెట్టింది. కొన్ని రోజులుగా ఒక్క రోజు కొంత ధర తగ్గితే ఆనందం, మరుసరి రోజు పెరుగుదల గమనిస్తే “అమ్మో!” అనిపించేది కూడా ఈ వ్యాపారంలో సాధారణం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఫిబ్రవరి నెల నుండి వివాహ సీజన్ ప్రారంభమైన కారణంగా బంగారం ప్రేమికులు ధరల పరిస్థితిపై వేచిచూస్తున్నారు. నేడు, ఫిబ్రవరి 15 (ఆదివారం), ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,750 కిలో స్థాయిలో ఉండగా, నేడు అదే స్థిరంగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.1,44,600 కాగా, నేడు కూడా అదే ధరలో ఉంది.

వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు వెండి కిలో ధర రూ.2,80,000గా నమోదు అయింది. ప్రాంతానికి అనుగుణంగా స్వల్ప తేడాలు ఉండవచ్చు, కానీ ఆందోళన కలిగించే విధంగా పెద్ద మార్పులు లేవు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో కొనసాగుతున్నాయి.

ALSO READ: Mahashivratri: శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!