STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 12:52 pm Posted by : Star Trinethram

POCSO Case: ఇద్దరమ్మాయిలను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ జ్యోతిష్కుడు.. కోర్టు సంచలన తీర్పు

POCSO Case: తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో జ్యోతిష్యుడికి కఠిన శిక్ష పడింది. బాలికలపై అమానుషంగా ప్రవర్తించినందుకు పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 200 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఘనమైన తీర్పును వెలువరించింది. అంతేకాకుండా బాధిత బాలికలకు ఆర్థిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన వెలుగులోకి రావడం ఆలస్యమైనప్పటికీ, కోర్టు తీర్పు సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచింది.

2021 నవంబర్‌లో శివగంగ జిల్లా మానగిరి ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడిని ఒక మహిళ ఆశ్రయించింది. తన ఇద్దరు కుమార్తెలకు చదువులో పురోగతి లేదని, వారికి ఎలాంటి దోషాలు ఉన్నాయో చెప్పి పరిష్కారం చూపాలని కోరింది. నమ్మకంతో వెళ్లిన ఆ మహిళకు జ్యోతిష్యుడు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పి, బాలికలను తన ఇంటికి తీసుకురావాలని సూచించాడు. ఆ మహిళ అతనిపై విశ్వాసంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని వెళ్లింది.

ఇంటికి చేరుకున్న తర్వాత ఆ జ్యోతిష్యుడు మహిళను ఒక గదిలో ఉండమని చెప్పి, బాలికలను మరో గదిలోకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడే ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తరువాత విచారణలో వెల్లడైంది. ఈ విషయం బయటపెడితే వారి తల్లిదండ్రులకు అపాయం జరుగుతుందని బెదిరించినట్లు కూడా ఆరోపించారు. చిన్న వయస్సులో ఉన్న బాలికలు భయంతో ఎవరికీ చెప్పకుండా బాధను భరించాల్సి వచ్చింది.

ఈ ఘటన దాదాపు 2 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో ఒక బాలిక వయసు 18 కాగా, మరొకరి వయసు 14గా ఉంది. ఇటీవల ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, లైంగికంగా సంక్రమించే వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలికలను ప్రశ్నించగా జరిగిన దారుణం బయటపడింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తిరుపత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కేసు శివగంగ జిల్లా పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం న్యాయమూర్తి గోకుల్ మురుగన్ మంగళవారం కీలక తీర్పును వెలువరించారు. నిందితుడు రామకృష్ణన్‌కు 200 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు రూ.2 లక్షల జరిమానా కూడా విధించారు. అదేవిధంగా బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పు బాలలపై జరిగే లైంగిక నేరాలపై కఠిన వైఖరిని స్పష్టంచేస్తూ, సమాజానికి గట్టి సందేశాన్ని అందించింది.

ALSO READ: Gang Assault Case: పక్కకు లాక్కెళ్లి ప్రియుడి ముందే అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు దారుణం