Phone tapping case: కేసీఆర్ అనుమానితుడా?.. నిందితుడా?

Phone tapping case: గత రెండు వారాలుగా తెలంగాణ రాజకీయ వాతావరణం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూనే తిరుగుతోంది. ఒకప్పుడు నెమ్మదిగా సాగిందన్న విమర్శలు ఎదుర్కొన్న ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వేగం పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్‌లో కీలక నేతలు, ఉన్నతాధికారులను విచారించిన సిట్.. ఆదివారం గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు...