STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 1:51 pm Posted by : Star Trinethram

Iran vs Israel: యుద్ధం మొదలైంది

Iran vs Israel: టెహ్రాన్‌తో పాటు ఇరాన్ దేశవ్యాప్తంగా సుమారు 30కు పైగా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దళాలు ఉమ్మడిగా క్షిపణి దాడులకు దిగినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ మెరుపు దాడులతో రాజధాని సహా పలు నగరాలు బాంబుల శబ్దాలతో దద్దరిల్లినట్లు సమాచారం.

ప్రత్యేకంగా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలుస్తోంది. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలు లక్ష్యాలుగా మారాయి. ఇరాన్ అణు శక్తి సంస్థకు సంబంధించిన కేంద్రాల సమీపంలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ చర్యలకు ప్రతిదాడి తప్పదని స్పష్టం చేసింది. యుద్ధాన్ని మొదలుపెట్టింది ప్రత్యర్థి దేశాలేనని, కానీ దీని ముగింపు తమ చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. తగిన సమయంలో గట్టి సమాధానం ఇస్తామని ప్రకటించింది.

ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రతిదాడులను ముందుగానే అంచనా వేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ దేశ పౌరులకు అప్రమత్త సందేశాలు పంపింది. క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల సమీపంలో ఉండాలని సూచించింది. ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. పరిస్థితులు ఎలా మారుతాయో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

ALSO READ: Iran vs Israel: యుద్ధం మొదలైంది