STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 10:17 pm Posted by : Star Trinethram

Haryana Crime: 19 ఏళ్ల అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌కు నిప్పంటించిన ప్రియుడు

Haryana Crime: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరంలో జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 19 ఏళ్ల యువతిపై ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడు దారుణంగా దాడి చేసిన సంఘటన బయటపడింది. బాధితురాలి ఆరోపణల ప్రకారం.. ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

శివం అనే యువకుడు త్రిపుర రాష్ట్రానికి చెందిన యువతి 2024లో ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం వారి స్నేహం ప్రేమగా మారి, గురుగ్రామ్‌లో సహజీవనం ప్రారంభించారు. బాధితురాలు జీడీ గోయెంకా విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లు సమాచారం. మొదట్లో సంబంధం సజావుగానే సాగినప్పటికీ, కొద్ది కాలానికే యువకుడి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు ఆమె పేర్కొంది.

తనపై తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేశాడని, చిన్న విషయాలకే గొడవపడేవాడని యువతి తెలిపింది. ఇటీవల జరిగిన వాగ్వాదం సందర్భంగా శివం ఉక్కు సీసాతో తనను కొట్టాడని, అనంతరం శానిటైజర్‌ పోసి నిప్పంటించాడని ఆరోపించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. సంబంధం ఎలా ప్రారంభమైంది, ఇటీవలి కాలంలో ఎలాంటి విభేదాలు నెలకొన్నాయి, దాడికి అసలు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. సహజీవనం పేరుతో మోసపూరిత సంబంధాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Land Rover Defender: కొడుక్కి ప్రేమతో ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్య