STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 7:22 pm Posted by : Star Trinethram

అమ్మాయిగా మారిన మాజీ క్రికెటర్ కొడుకు .. మరో ఆపరేషన్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ హార్మోన్ తన వ్యక్తిత్వ ప్రయాణంలో కీలకమైన నిర్ణయం తీసుకుని లింగ మార్పిడి ప్రక్రియను ఆరంభించిన విషయం తెలిసిందే. హార్మోన్ మార్పిడి చికిత్సను కొనసాగిస్తూ తాను అమ్మాయిగా జీవించాలనే తన నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం అనయ బంగర్‌గా తనను గుర్తించుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియలో భాగంగా తాను మార్చి నెలలో బ్యాంకాక్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు ఆమె వెల్లడించారు. లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలో భాగంగా శరీర నిర్మాణంలో మార్పులు చేస్తారు. పురుషాంగం స్థానంలో వెజైనాను ఏర్పాటుచేస్తారు. ఇది అత్యంత నైపుణ్యం అవసరమైన వైద్య విధానం. శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సుమారు 6 నెలల సమయం పట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణ అవసరం ఉంటుంది.

అదేవిధంగా శస్త్రచికిత్స అనంతరం ప్రతి ఏడాది వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించడం, శరీర ఆరోగ్యాన్ని సమీక్షించడం వంటి అంశాలు దీర్ఘకాల సంరక్షణలో భాగమవుతాయి. ఈ శస్త్రచికిత్స ఖర్చు ఆసుపత్రి, వైద్య నైపుణ్యం, చికిత్సా విధానంపై ఆధారపడి మారుతూ ఉంటుంది. సాధారణంగా 3 లక్షల నుండి 10 లక్షల వరకు వ్యయం కావచ్చని అంచనా వేస్తున్నారు.

లింగ వైవిధ్యాన్ని అంగీకరించే దిశగా సమాజంలో అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో వ్యక్తిగత గుర్తింపును గౌరవించడం అత్యంత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి వ్యక్తికి తన జీవన విధానాన్ని ఎంచుకునే హక్కు ఉందని, అలాంటి నిర్ణయాలను సమాజం గౌరవించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటున్నారు. అనయ బంగర్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదాహరణగా నిలుస్తోంది.

ALSO READ: Sherlyn Chopra: బడా పొలిటీషియన్ కొడుకు నన్ను వాడుకున్నాడు.. డబ్బు కోసం పడక పంచుకున్నా