STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 7:16 pm Posted by : Star Trinethram

2వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు జ్యోతి నవీన్ నాయక్ ప్రచారం

బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి

స్టార్ త్రినేత్రం, వర్దన్నపేట:


Municipal Elections: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు జ్యోతి నవీన్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఒక్కటిగా కదిలి వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ప్రజలతో సన్నిహితంగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా బానోతు జ్యోతి నవీన్ నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు. వర్ధన్నపేట పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్ఎస్ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలంటే బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎఫ్ నేతలు తోటకూరి శ్రీధర్, ప్రసాద్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు. ప్రజల మద్దతుతో ఈసారి రెండో వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు

ALSO READ: Ujas ego LA: అబ్బా.. మరీ ఇంత తక్కువనా!.. రూ.34 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్