STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 10:13 pm Posted by : Star Trinethram

AUS vs OMAN: T20 WC 2026లో ఆస్ట్రేలియా విధ్వంసం

AUS vs OMAN: చివరి లీగ్ పోరులో ఆస్ట్రేలియా జట్టు గర్జించింది. నాకౌట్ అవకాశాలు చేజారినా నిరుత్సాహానికి లొంగకుండా ఒమన్‌పై దుమ్మురేపింది. 105 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్ బీలో 3వ స్థానాన్ని దక్కించుకుంది.

ఛేదనలో ఓపెనర్లు మిచెల్ మార్ష్ 64 నాటౌట్, ట్రావిస్ హెడ్ 32 చెలరేగిపోయారు. తొలి ఓవర్లోనే మార్ష్ మూడు ఫోర్లతో దూకుడు చూపగా, హెడ్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. 4.1 ఓవర్లకే జట్టు స్కోరు 50 దాటింది. పవర్ ప్లే ముగిసే సరికి 73 పరుగులు సాధించి మ్యాచ్‌ను దాదాపు ఏకపక్షంగా మార్చేశారు.

9వ ఓవర్లో హెడ్ అవుటైనా అప్పటికే విజయం ఖాయమైంది. చివర్లో ఓష్ ఇంగ్లిస్ 12 నాటౌట్ రెండు ఫోర్లతో లాంఛనం పూర్తి చేశాడు. మార్ష్ అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు 104 పరుగులకే కుప్పకూలింది. తొలి బంతికే అమిర్ కలీం 0 ఔటవ్వడంతో ఒత్తిడి మొదలైంది. గ్జావియర్ బార్ట్‌లెట్ 2 వికెట్లు తీసి దెబ్బకొట్టగా, తరువాత ఆడం జంపా చెలరేగాడు.

జంపా 4 వికెట్లు పడగొట్టి ఒమన్ నడుము విరిచాడు. హమ్మద్ మిర్జా 16, వసీం అలీ 32 కొంత పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. షఫీక్ జైన్ 0గా ఔటవ్వడంతో ఒమన్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఈ మ్యాచ్‌తో జంపా పొట్టి ప్రపంచకప్ చరిత్రలో 2వ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. షకీబుల్ హసన్ 50 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, రషీద్ ఖాన్ 43 వికెట్లతో తరువాతి స్థానంలో ఉన్నాడు.

ALSO READ: Commissioner CH Priyanka: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలి