Ather Rizta: మధ్యతరగతి మనసు దోచుకుంటున్న స్కూటర్.. అమ్మకాలు చూస్తుంటే ఆశ్చర్యమే!

Ather Rizta: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ వేగం పెంచుకుంటోంది. పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గుచూపుతుండగా, ఎలక్ట్రిక్ వాహనాలు నగర జీవనశైలిలో భాగమవుతున్నాయి. ఈ పోటీలో బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కుటుంబ అవసరాలకు అనువైన స్కూటర్ ఏథర్ రిజ్తా (Ather Rizta) మార్కెట్‌లో గణనీయమైన ఆదరణ పొందుతోంది. 2026 ప్రారంభంలో ఈ వాహనం అమ్మకాల గణాంకాలు పరిశీలిస్తే వినియోగదారుల విశ్వాసం ఎంత పెరిగిందో...