Andhra Pradesh: అమరావతికి బిల్ గేట్స్!

Andhra Pradesh: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసిన మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానుండటం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం తెచ్చిపెడుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న కాలం నుంచే బిల్‌ గేట్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా...