Bharata Parapati Sangham: ఘనంగా భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలు

Bharata Parapati Sangham: వర్ధన్నపేట పట్టణకేంద్రంలో ఆదివారం భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఆ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాలను చేపట్టారు. గత 36 సంవత్సరాలుగా సంఘం చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను స్మరించుకుంటూ నాయకులు తమ భావాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన బెజ్జం పాపరావును ప్రత్యేకంగా సత్కరించారు. సంఘ సభ్యులంతా...