మహారాష్ట్రలోని లోకల్ ట్రైన్‌లో జరిగిన ఓ ఘటన మహిళల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. బురఖా ధరించిన ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి మహిళల మధ్య నిల్చోవడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కంపార్ట్‌మెంట్ పూర్తిగా మహిళలతో నిండిపోయి ఉంది.
Shocking case on Mumbai local: Man in burqa disguise entered ladies compartment near Ghatkopar, allegedly tried molesting women. Alert passengers challenged him; he escaped by leaping to another train. FIR lodged at Ghatkopar PS; GRP & RPF investigating.
pic.twitter.com/GgqccoX11M— Ghar Ke Kalesh (@gharkekalesh) February 8, 2026
బురఖా ధరించిన వ్యక్తి ఆడవారి మధ్య ఎలాంటి చలనం లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని గమనించిన కొంతమంది మహిళలకు అనుమానం వచ్చింది. అతడి ప్రవర్తన సహజంగా లేదని భావించిన వారు ప్రశ్నించగా, అతడు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. మహిళలు గట్టిగా నిలదీయడంతో చివరకు బురఖా ముసుగు తొలగించగా, అందరూ షాక్‌కు గురయ్యారు. బురఖాలో ఉన్నది మహిళ కాదు, పురుషుడని తేలింది.
ఈ విషయం తెలిసిన వెంటనే కంపార్ట్‌మెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంతమంది మహిళలు అతడిని వీడియో తీస్తూ, పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ఆ యువకుడు భయంతో రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనను చూసిన మహిళలు ఘట్కోపార్ స్టేషన్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రైన్, స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైళ్లలో కూడా మహిళలకు భద్రత లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల రక్షణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి..?