Municipal elections: 9వ వార్డులో మొదలైన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

అరూరి రమేష్ ఆధ్వర్యంలో హడావుడి బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిన ఉత్సాహం మహిళల ఆదరణతో ప్రత్యేక ఆకర్షణ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం Municipal elections: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలోని 9వ వార్డులో బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారానికి దిగడంతో స్థానికంగా సందడి నెలకొంది. ఉదయం వేళ నుంచే పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో...