Renault KWID: కస్టమర్లు లేక దోమలు కొట్టుకుంటున్న రెనాల్ట్ క్విడ్ కంపెనీ డీలర్లు
Renault KWID: కారు మార్కెట్లో ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్‌లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన రోజులు ఉన్నాయి. తక్కువ ధరలో లభించడం, ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉండటం, నగర రద్దీ రోడ్లలో సులభంగా నడిపే అవకాశం ఉండటం వంటి అంశాలు హ్యాచ్‌బ్యాక్‌లను మధ్యతరగతి కుటుంబాలకు తొలి ఎంపికగా మార్చాయి. ఉద్యోగానికి వెళ్లే యువత నుంచి కుటుంబ అవసరాల వరకు ఈ కార్లు అన్ని విధాలా సరిపోతాయని వినియోగదారులు భావించేవారు. అయితే కాలక్రమేణా మార్కెట్ స్వరూపమే మారిపోయింది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలు కొత్త దిశగా మలుపు తిరిగాయి. ఎక్కువ...