STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 7:48 pm Posted by : Star Trinethram

Megastar: చిరంజీవి ఒక్కరోజు ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు గిర్రున తిరుగుతాయ్..!

Megastar: కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదన్న సామెత మెగాస్టార్ చిరంజీవికి అచ్చుగుద్దినట్టే సరిపోతుంది. మనకు బయటికి తెలిసేవి కొన్ని మాత్రమే అయినా.. ఆయన వల్ల ప్రతీ రోజు ఎవరో ఒకరు సహాయం పొందుతూనే ఉంటారని సినీ వర్గాలు చెబుతుంటాయి. వెలుగులోకి రాని ఈ సేవలు చిరంజీవిని కేవలం ఒక నటుడిగానే కాకుండా, సమాజానికి అండగా నిలిచే వ్యక్తిగా నిలబెడతాయి. గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా కోట్లు సంపాదించే వాళ్లు చాలామందే ఉన్నా.. సహాయం చేయడంలో మాత్రం చిరంజీవి ప్రత్యేకంగా కనిపిస్తారని చెప్పాలి.

సినీ ఇండస్ట్రీలో చిరంజీవి పేరు వినిపించగానే ముందుగా గుర్తుకు వచ్చే అంశం ఆయన మానవత్వం. హాస్పిటల్ ఖర్చులు కావొచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కావొచ్చు, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన కుటుంబాలకి చేయూత కావొచ్చు.. ఎవరు ఆయన దగ్గరకు చేరినా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదట. ఈ సహాయాలన్నీ ప్రచారం కోసం కాకుండా, పూర్తిగా గోప్యంగా జరుగుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

ఇండస్ట్రీలో వినిపించే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి రోజువారీగా సహాయాల కోసం ఖర్చు చేసే మొత్తం అక్షరాలా రూ.25 లక్షల వరకు ఉంటుందట. అంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం పదేళ్ల పాటు సౌకర్యంగా జీవించగలిగే మొత్తాన్ని ఆయన ఒక్క రోజులోనే ఇతరుల కోసం ఖర్చు చేస్తుండటం నిజంగా ఆశ్చర్యకరం. ఇదే చిరంజీవిని అభిమానుల హృదయాల్లో దేవుడిలా నిలబెట్టిన ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

సినీ ఇండస్ట్రీని ఒక పెద్ద పుస్తకంగా భావిస్తే, అందులో తొలి ఐదు పేజీల్లో చిరంజీవి పేరు తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆయన కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌బస్టర్లు మాత్రమే కాదు, ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. కానీ విజయాలు, పరాజయాలు ఎంత వచ్చినా అభిమానగణం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పటికీ నాన్నల తరం నుంచి మన తరం వరకూ చిరంజీవిని అన్నయ్యలా అభిమానించే వాళ్లు ఉన్నారు అంటే అది ఆయన సంపాదించిన నమ్మకానికి నిదర్శనం.

సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవికి ప్రత్యేకత ఏమిటంటే, హీరోలకే ఆయన ఫ్యాన్‌గా ఉండే పరిస్థితి. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఏడుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తూ, రికార్డులు తిరగరాస్తున్న సినిమాలు చేయడం చిరంజీవికే సాధ్యమైంది.

ఇటీవల ఆయన నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, రీజినల్ స్థాయిలో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.160 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమాలో ప్రేక్షకులు లిటరల్‌గా వింటేజ్ మెగాస్టార్‌ను చూశారని చెప్పాలి. చిరంజీవి డ్యాన్స్ ఎనర్జీ, టైమింగ్ ఉన్న కామెడీ, పవర్‌ఫుల్ యాక్షన్ స్టంట్స్ అన్నీ కలిపి పూర్తి ప్యాకేజీగా కనిపించాయి. చాలా సంవత్సరాల తర్వాత అభిమానులు కోరుకున్న చిరంజీవి స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాడు. దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సినిమాను ఎంటర్‌టైనర్‌గా మలిచగా, నయనతార హీరోయిన్‌గా మెప్పించింది.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మెగాస్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువు చేసింది. సహాయం విషయంలోనూ, కెరీర్ విషయంలోనూ ఎవరికీ కనిపించకుండా తనదైన బాటలో ముందుకెళ్తూ, చిరంజీవి ఇప్పటికీ ఎందుకు మెగాస్టార్ అనిపించుకుంటున్నాడో ఈ విజయం స్పష్టంగా చూపిస్తోంది.

ALSO READ: Payal Ghosh: ఛాన్స్ దొరకాలే గానీ ప్రభాస్‌ను వదిలేదే లేదు