Medical Negligence: ప్రభుత్వ ఆస్పత్రిలో చక్కర్లు కొడుతున్న వీధి కుక్క
Medical Negligence: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో ఉన్న లోపాలను ఎండగట్టే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి జీఎస్వీఎమ్లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆసుపత్రులు అంటే శుభ్రత, భద్రత, రోగుల సంరక్షణకు ప్రతీకగా ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా, ఆ ఆసుపత్రిలో వీధి కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్న దృశ్యాలు ప్రజలను షాక్కు గురిచేస్తున్నాయి. జీఎస్వీఎమ్ ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో రోగులు చికిత్స పొందుతున్న ప్రదేశంలోనే ఒక...