Medaram: గద్దెపైకి సమ్మక్క
వనం నుంచి జనంలోకి సమ్మక్క భారీ భద్రత మధ్య గద్దెల పైకి సమ్మక్క ఆగమనం అమ్మ రాకతో ప్రశాంతంగా తన్మయత్వంతో మేడారం సమ్మక్క ఆగమనంతో ఊపందుకున్న జాతర మేడారం మహా జాతరలో భక్తులంతా ఉత్కంఠగా ఎదురుచూసిన అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి అడవిని విడిచి భక్తజన సమూహంలోకి అడుగుపెట్టడంతో మేడారం ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో మార్మోగింది. అడవుల మధ్య కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు జయజయధ్వానాలు పలుకుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనంతో మేడారం పరిసరాలు ఒక్కసారిగా ఆధ్యాత్మిక...