Kaushik Reddy: ఇంతటితో ముగించాలి.. క్షమాపణ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Kaushik Reddy: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, కొన్ని పరిణామాల వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణంగా నోరు జారిన మాటలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేస్తూ తన వివరణను వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు...