సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్
స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శుక్రవారం మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మలను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెలపై కొలువైన వనదేవతలకు నైవేద్యాలు సమర్పించి భక్తితో ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. మేడారం వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సమ్మక్క సారలమ్మలు ప్రజల కష్టాలను తొలగించే శక్తిమంతమైన వనదేవతలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం...